Hyderabad, మార్చి 6 -- వేసవి వచ్చిందంటే శరీరానికి చలువ చేసే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. ఎండాకాలంలో షర్బత్‌లు తాగే వారి సంఖ్య ఎక్కువే దీన్ని బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే తాజాగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము పుచ్చకాయ షర్బత రెసిపీ ఇచ్చాము. దీన్ని ఒక్కసారి తాగారంటే మర్చిపోలేరు. ఇది శరీరానికి చలువను అందించడంతోపాటు శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పుచ్చకాయ - అర ముక్క

పాలు - ఒక కప్పు

పంచదార - మూడు స్పూన్లు

రోజ్ సిరప్ - రెండు స్పూన్లు

సబ్జా గింజలు ఒక స్పూను

ఐస్ క్యూబ్స్ - ఐదు

ఆల్మండ్ గమ్ - ఒక స్పూను

డ్రై ఫ్రూట్స్ తరుగు - ఒక స్పూను

1. పుచ్చకాయను సన్నని ముక్కలుగా కోసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసి పక్కన పెట్టేయాలని.

2. ఇప్పుడు ఒక గిన్నెలో మరిగించి చల్లార్చిన పాలను వేయాలి.

3. అందులోనే మూడు స్పూన్ల పంచదారను వేయాల...