Hyderabad, ఫిబ్రవరి 3 -- ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరు బరువు పెరిగే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సాధారణంగా చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎంతో మంది బరువు పెరిగిపోతారు. బరువు తగ్గే విషయానికి వస్తే సరైన ఆహారం తీసుకోవడంతో పాటూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది. బరువు తగ్గడం అంత సులభం కాదు. కొన్ని అలవాట్లు ద్వారా బరువు తగ్గడం సులువుగా మార్చుకోవచ్చు. బరువు తగ్గడానికి నీరు ఎంతో సహాయపడుతుందని హార్వర్డ్ అధ్యయనం తేల్చి చెప్పింది.

కొత్త అధ్యయనం ప్రకారం బరువు తగ్గడానికి నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, తగినంత నీరు త్రాగటం జీవక్రియను పెంచుతుంది, అంతేకాకుండా నీరు కూడా జంక్ ఫుడ్ తినాలన్న కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సరైన మొత్తంలో నీరు త్రాగటం మంచి జీర్ణక్రియ, మొత్తం పొట...