Hyderabad, మార్చి 26 -- ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. శరీరానికి తగినంత నీరు అందకపోతే ఎన్నో రకాల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారు. మరీ ముఖ్యంగా వేసవిలో సూర్యుడి తాపం పెరిగేకొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. అందుకని ఎండాకాలం పోయే వరకూ ఎంత ఎక్కువ నీరు తాగిచే అంత మంచిది. అయితే అవి వేడి నీరు అయి ఉండాలా లేక చల్లటి నీరా? వేసవిలో నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి? అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇలాంటి సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. మీ మనసులో కూడా ఇవే ప్రశ్నలు మెదులుతుంటే ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది.

సాధారణంగా గోరు వెచ్చటి నీరు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని, రక్తనాళాల్లోని విష పదార్థాలన్నింటినీ బయటికి పంపించగల శక్తి వేడి నీటికి ఉంట...