Hyderabad, ఫిబ్రవరి 19 -- మొక్కలు పెరిగేందుకు నేల, నీరు అతి ముఖ్యమైనవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్లలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. మట్టిని ఉపయోగించి కుండీల్లో మొక్కలు పెంచడం వారికి కష్టంగా మారిపోతుంది. దానివల్ల బాల్కనీ పాడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే మొక్కలు పెంచడమే మానేస్తున్నారు.

అయితే కొన్ని రకాల మొక్కలకి మాత్రం నీరు తప్ప మట్టి అవసరం లేదు. అలాంటి మొక్కల జాబితాను ఇక్కడ ఇచ్చాము. ఇవి అన్నీ కూడా నీటిలో పెరిగే మొక్కలు. ఇవి మట్టిలో వేసినా పెరుగుతాయి. మట్టి లేకుండా కూడా పెరుగుతాయి. వీటిని మీరు చిన్న చిన్న గాజు సీసాలో నీటితోనే పెంచుకోవచ్చు. అన్ని నర్సరీలలో కూడా ఈ మొక్కలు లభిస్తాయి.

స్నేక్ ప్లాంట్స్ ఎక్కడైనా లభిస్తాయి. ఇవి మట్టిలో చాలా ఏపుగా పెరుగుతాయి. నీటిలో కూడా ఇవి పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు....