Hyderabad, ఏప్రిల్ 9 -- పుచ్చకాయ వేసవిలోనే లభించే పండు. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పుచ్చకాయలో ఉండే నీటి శాతం శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడటమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.

పుచ్చకాయను వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, దీన్ని అధికంగా తినడం వల్ల శరీరానికి చలువు అవుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే మీరు అవసరమైన దానికంటే ఎక్కువ పుచ్చకాయ తింటే మాత్రం సమస్యలు వస్తాయి. కాబట్టి పుచ్చకాయను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మానుకోండి. పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలేంటో చూద్దాం..

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయలో మూత్రవిసర్జన లక్షణాలు ఎక్కువగా ఉం...