Hyderabad, ఫిబ్రవరి 21 -- మరికొద్దిరోజుల్లో వేసవి కాలం రాబోతుంది కదా. చాలా మంది తమ బిడ్డల దాహం తీర్చాలని, నీళ్లను నేరుగా ఇవ్వాలనుకుంటారు. పైగా తాము నీరు తాగిన ప్రతిసారి పట్టించేస్తుంటారు. ఇది ప్రమాదకరమే కాదు. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారొచ్చట! అదెలాగో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం..

పసిపిల్లలకు నీరు తాగిస్తే హాని కలిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు 6 నెలల లోపు వయస్సున్న వారికి చాలా తక్కువ మొత్తంలోనే నీరు ఇవ్వాలట. అనుమతి కంటే ఎక్కువ నీరు ఇస్తే ప్రమాదం కలుగుతుందట! ఎందుకో, ఎలాగో చూద్దాం.

చిన్న పిల్లల బాధ్యత వహించే వారు, కొత్తగా డెలివరీ అవబోతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. తమ బిడ్డలను కాపాడుకోవాలని తపన పడే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. సాధారణంగా ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకూ ...