Hyderabad, ఫిబ్రవరి 9 -- రోజంతా పనిచేసి అలసిపోయే మహిళలకు వాషింగ్ మిషన్ మంచి ఉపశమనం. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ చాలా సులభమైన, సౌకర్యవంతమైన సాధనం. ఇది తక్కువ సమయంలో బట్టలను ఉతికడమే కాకుండా ఆరబెడుతుంది. కానీ చాలా మంది బట్టలు ఉతికేటప్పుడు, ఉతికిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బట్టలు ఉతుకుతున్న సమయంలో మాత్రమే కాదు.. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదట. లేదంటే ఇది బ్యాక్టీరియా పెరగడానికి దారితీసి, వ్యాధులకు కారణం అయి మీ ఆరోగ్యానికి హాని చేస్తుందట. బట్టలు ఉతికిన తర్వాత మీరు ఈ పనులు చేస్తున్నట్లయితే వెంటనే ఆపండి.

చాలా మంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అలాగే వదిలేస్తారు. మిషన్ ఉతికేసి దానికదే ఆఫ్ అయి పోయాక వెంటనే ఆరబెట్టకుండా అలాగే చాలా సేపు ఉంచుతారు. ...