భారతదేశం, మార్చి 15 -- క్రికెట్ గ్రౌండ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లను చెండాడే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఇన్ని రోజులూ ఆటతో అలరించిన వార్నర్.. ఇప్పుడు యాక్టింగ్ తో అదరగొట్టబోతున్నాడు. తెలుగు సినిమా 'రాబిన్ హుడ్'తో ఇండియన్ సినిమాలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీ నుంచి వార్నర్ ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

గ్రౌండ్ లో అగ్రెసివ్ బ్యాటింగ్ తో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే వార్నర్.. యాక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు. ఇండియన్ సినిమాలో అడుగుపెడుతున్నాడు. నితిన్-శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీలో వార్నర్ స్పెషల్ కామియో ప్లే చేశాడు. మైత్రి మూవీస్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫస్ట్ లుక్ లో వార్నర్ కూల్ గా కనిపిస్తున్నాడు. కిందకు చూస్తూ ఓ రకమైన నవ్వు విసురుతున్నాడు. ...