భారతదేశం, ఏప్రిల్ 12 -- ఆస్ట్రేలియా విధ్వంసక మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌ (పీఎస్ఎల్)లో తన అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. కరాచి కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బిజీ షెడ్యూల్ కారణంగా పీఎస్ఎల్ లో వార్నర్ ఆడలేకపోయాడు. ఇప్పుడు తన ఫస్ట్ సీజన్ కోసం రెడీ అయ్యాడు. నేడు (ఏప్రిల్ 12) కరాచి కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో వార్నర్ పాల్గొన్నాడు. అప్పుడు ఇండియా గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వార్నర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

కరాచి కింగ్స్ జట్టు ఈ రోజు ముల్తాన్ సుల్తాన్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వార్నర్‌కు ఒక పాకిస్తాన్ రిపోర్టర్ నుంచి ఉద్దేశపూర్వకమైన ప్రశ్న ఎదురైంది. ఈ ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో వార్నర్ అమ్ముడుపోలే...