భారతదేశం, జనవరి 30 -- Warangal Suicide: ప్రియుడి గొంతు కోయడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు రోజుల క్రితం వరంగల్ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బాధిత యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతుండగా.. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

స్నాప్ చాట్ చాటింగ్ ద్వారానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. అనంతరం తరచూ చాటింగ్ చేసుకోవడం, అందులోనూ ఒకే కాలేజీ అని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఆ ప్రేమ వ్యవహారమే ఇప్పుడు ఇంతటి దారుణానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ చైతన్య నగర్ ప్రాంతానికి చెందిన కూతాటి భరత్ కుమార్ హనుమకొండ వడ్డేపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివాడు. అదే కాలేజీలో హనుమకొండ గోపాలపూర్ శ్రీనివాస కాలనీకి చెందిన ఓ బాలిక కూడా చది...