భారతదేశం, మార్చి 8 -- Warangal SRSP Canal : వరంగల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కారులో స్వగ్రామం వెళ్తుండగా.. కారు అదుపు తప్పి ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాబు మృతిచెందగా.. తండ్రి, ఐదేళ్ల పాప కారుతో సహ గల్లంతయ్యారు. కాగా తల్లి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో భయటపడింది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్(30) ఎల్ఐసీ హనుమకొండ బ్రాంచ్ లో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కొడుకు ఆర్యవర్థన్(2)తో కలిసి హనుమకొండలోనే నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం ఉదయం 10 గంటల సమయంలో స్వగ్రామమైన మేచరాజుపల్లికి హనుమకొండ నుంచి బయలుదేరాడు. ఈ క్...