భారతదేశం, ఫిబ్రవరి 25 -- Warangal Special Bus: ప్రముఖ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్​ పరిధిలోని వివిధ డిపోల నుంచి దాదాపు 255 బస్సులను తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హనుమకొండ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సుల ఛార్జీలను కూడా ఖరారు చేశారు. ఈనెల 25, 26,27 రోజులలో ఈ స్పెషల్ బస్సుల సేవలు అందుబాటులో ఉండనుండగా.. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్​ మేనేజర్​ విజయభాను విజ్ఞప్తి చేస్తున్నారు.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం వరంగల్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాలను ఆర్టీసీ సేవలందించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలోనే పేరుగాంచిన శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ,...