భారతదేశం, ఏప్రిల్ 6 -- Warangal Road Accident : వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఓ ఇద్దరు స్టూడెంట్స్ బైక్ పై గుడికి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తలకు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోగా.. బైక్ పై ఉన్న యువతి గాయాలతో ఆసుపత్రి పాలైంది. బాధిత కుటుంబ సభ్యులు, హసన్ పర్తి పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఆర్కే-6 కాలనీకి చెందిన రామటెంకి శ్రవణ్ పెద్ద కొడుకు అయిన రామటెంకి ఉదయ్ (18) హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారులో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ చదువుతున్నాడు. ఇదే యూనివర్సిటీలో రాంశెట్టి రజిత అనే యువతి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. ఇద్దరూ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుండగా.. ఇద్దరి...