భారతదేశం, ఏప్రిల్ 14 -- Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చోట్ల వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపించాయి. ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా.. బలమైన ఈదురు గాలులు వీచాయి. దానికి తోడు వడగండ్ల వాన పడటంతో కొన్నిచోట్లా పంటలకు నష్టం వాటిల్లి రైతన్నలు ఇబ్బంది పడగా, ఇంకొన్ని చోట్లా ఇళ్లు దెబ్బతిని జనాలు అవస్థలు పడాల్సి వచ్చింది.

జనగామ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వడగండ్ల వాన పడింది. దీంతో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం కాస్త వరదకు కొట్టుకుపోయింది. మిగతా ధాన్యమంతా వర్షానికి తడిసి ముద్దయ్యింది. దీంతో అన్నదాతలు ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు.

జనగ...