భారతదేశం, ఏప్రిల్ 10 -- Warangal Politics: కడియం శ్రీహరి బినామీలతో 2 వేల ఎకరాల ఫారెస్ట్ భూములను కబ్జా చేస్తున్నారంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కబ్జాలు రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమేనంటూ కడియం శ్రీహరి స్పష్టం చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ ముగ్గురి మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో ఇనుపరాతి గట్లలో దాదాపు 4 వేల ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉండేది. హనుమకొండ జిల్లాలోని ఏకైక ఫారెస్ట్ ఏరియా ఇదే కాగా.. ఆ గుట్టలను ఆనుకుని దేవునూరు, ముప్పారం, కొత్తపల్లి, ఎర్రబెల్లి, దామెర గ్రామాల శివారు పట్టా భూములు కూడా ...