భారతదేశం, ఫిబ్రవరి 23 -- 'నాకు భయం వేస్తోంది. పరీక్ష రాయను' అని ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఓ పిల్లాడు మారాం చేశాడు. ఆ బాలుడుని పోలీసులు బుజ్జగించి, ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపారు. ఈ ఘటన హన్మకొండలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి తొమ్మిదవ తరగతుల్లో ప్రవేశాలకు.. ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. పలివేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడకు పరీక్ష రాసేందుకు తండ్రితో ఓ విద్యార్ధి వచ్చాడు. అయితే.. 'నేను లోపలికి పోను.. నాకు భయం వేస్తోంది' అని మారాం చేశాడు.

అప్పుడే పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు.. హన్మకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి అక్కడికి వచ్చారు. మారాం చేస్తున్న బాలుడి దగ్...