భారతదేశం, మార్చి 4 -- తమిళనాడు రాష్ట్రం కుంభం ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా.. 2010లో రష్యాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత సంగారెడ్డి జిల్లాకు వచ్చి అక్కడ ఓ ఫార్మసీ కాలేజీలో సీఎంవోగా పని చేశాడు. అనంతరం కరీంనగర్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో పని చేశాడు. ఆ తరువాత 2020లో జనగామలోని హనుమకొండ మార్గంలో కేకే హాస్పిటల్ పేరున ప్రైవేటు క్లీనిక్ ఓపెన్ చేసి నిర్వహిస్తున్నాడు.

జనగామలో హాస్పిటల్ నడుపుతున్న సుల్తాన్ రాజా తన వద్దకు చికిత్స కోసం వచ్చే అమాయకులతో పరిచయం పెంచుకున్నాడు. వారితో మాట కలిపి తాను టిప్పు సుల్తాన్ వారసుడినని, టిప్పు సుల్తాన్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్ తానేనంటూ అందరినీ నమ్మించాడు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ కు రూ.700 కోట్లు కేటాయించిందని, ఆ డబ్బులతో ట్రస్ట్ పేరిట హైదరాబాద్‌లో మెడికల్ కాలేజీ నిర్మిస్తానని చెప్పుకొచ...