భారతదేశం, ఏప్రిల్ 15 -- వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీసుల వ్యవహారం చూస్తే.. ఆశ్చర్యమే కలుగుతోంది. కొన్నేళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తిపై వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు భూకబ్జా నమోదు చేశారు. సుమారు తొమ్మిదేళ్ల కిందట ఆయన చనిపోగా.. ఇప్పుడు ఆయనపై భూకబ్జా కేసు నమోదు చేయడం పట్ల అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసుల అక్రమ కేసుల వ్యవహారానికి ఈ ఘటనే సాక్ష్యమని చర్చించుకుంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సు శివారు సర్వే నెంబర్లు.. 358, 386, అలాగే 199, 200,201 లో సుమారు 23 ఎకరాల భూమి ఉంది. దానిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బత్తిని చంద్రశేఖర్, బత్తిని సంపత్, బొమ్మగాని శ్రీను, వేణు, నాగరాజు అనే వ్యక్తులు తమ భూమిలోకి వచ్చి వివాదం సృష్టిస్తున్నారని.. భూమిలో...