తెలంగాణ,వరంగల్, ఫిబ్రవరి 26 -- జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధి వరంగల్ నగరంలోని కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న ఆమె రాత్రి సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపగా.. ఆమె ఆత్మహత్యపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లాకు చెందిన గుంటోజు సత్యనారాయణాచారి కి ఇద్దరు కూతుళ్లు. అందులో చిన్న కూతురు గుంటోజు రేష్మిత(19) అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో వరంగల్ పైడిపల్లి సమీపంలో ఉన్న రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఏఆర్ఎస్)లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. స్వగ్రామం నల్గొండ కావడంతో ఇక్కడే ఉన్న హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది. ఇంతవరకు బ...