భారతదేశం, ఏప్రిల్ 4 -- Warangal Murder: గుండ బ్రహ్మ‍య్య జాతరలో యువకుడిపై దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రెండు బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను సంగెం పీఎస్ లో బుధవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో మామునూరు ఏసీపీ తిరుపతి వెల్లడించారు.

ఉగాది పర్వదినం సందర్భంగా సంగెం మండలంలోని గవిచర్లలోని గుండ బ్రహ్మయ్య జాతర వైభవంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో మార్చి 30న జాతర జరగగా.. ఆ జాతరకు సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్ర బన్నీ(21), తన తల్లి పూల, చెల్లి పూజిత, అన్న ధని అలియాస్ శివ అంతా కలిసి వెళ్లారు. ఆ తరువాత కుటుంబ సభ్యులంతా ఇంటికి వెళ్లిపోగా.. చిర్ర బన్నీ తన స్నేహితులతో కలిసి జాతర ప్రాంగణంలోనే ఉన్నాడు.

జాతరలో ఉన్న చిర్ర బ...