వరంగల్,తెలంగాణ, మార్చి 7 -- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఘోర ప్రమాదం తప్పింది. వార్డులోని ఆక్సిజన్ సిలిండర్ పేలగా.. ఓ స్వీపర్ కు గాయాలయ్యాయి. దీంతో ఆమెను హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఎంజీఎం హాస్పిటల్ లోని ఆర్థో వార్డులోని పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఒక్కో బెడ్ కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం సమయంలో హాస్పిటల్ లో పని చేస్తున్న జ్యోతి అనే స్వీపర్ ఓ పేషెంట్ కు ఆక్సిజన్ సిలిండర్ అవసరమై అక్కడికి వెళ్లింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ సిలిండర్ పై ఉన్న క్లిప్పు ఒక్కసారిగా ఊడిపోయి పేలుడు సంభవించింది. దానిపై ఉన్న ఇనుప చువ్వ జ్యోతికి తగలడంతో ఆమెకు గాయాలయ్యాయి. కాగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వాల్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పక్కను...