వరంగల్,తెలంగాణ, ఫిబ్రవరి 28 -- మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ రాశారు. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయటంతో పాటు కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిర్ణయం తీసుకుందని ఇందులో తెలిపారు.

మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు పంపింది. భూసేకరణ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా. ముందుకెళ్లే పనిలో ఉంది. ఈ ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం. కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి కూడా పలుమార్లు విజ్ఞప్తి పత్రాలను అందజేసింది. ఈ నేపథ్యంలో. మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అంగీక...