భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఓ వ్యక్తి వీపుపై గాయాలు ఉన్నాయి. అతనిపై దెయ్యం దాడి చేసిందని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగిందని పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధి ముత్తోజిపేట గ్రామానికి వెళ్లి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ముత్తోజిపేట గ్రామం నుంచి ముత్యాలమ్మ తండాకు వెళ్లే రోడ్డులో ఓ చోట మర్రిచెట్టు ఉంది. ఓ వ్యక్తి అర్ధరాత్రి ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ మార్గంలో వెళ్తున్నారు. మర్రిచెట్టు వద్దకు రాగానే ఒక్కసారిగా దెయ్యం వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి వీపుపై గాయాలు అయ్యాయి. ఈ ప్రాంతంలో దెయ్యం ఉందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

దెయ్యం దాడి చేసిందనే ప్రచారం జ...