తెలంగాణ,వరంగల్, ఫిబ్రవరి 27 -- వరంగల్ లో డాక్టర్ పై జరిగిన హత్యాయత్నం మిస్టరీ వీడింది. డాక్టర్ భార్య జిమ్ ట్రైనర్ తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోగా.. విడాకులు అడిగినా ఇవ్వడం లేదన్న కారణంతో తన భర్తనే అడ్డు తొలగించుకునే కుట్ర చేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్త మర్డర్ కు స్కెచ్ గీసి, దాడి చేయించింది. దీంతో డాక్టర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. తన ఫ్రెండ్ కు ఇల్లీగల్ ఎఫైర్ కోసం సహాయం చేసేందుకు వచ్చిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు. వీరి అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించారు.

వరంగల్ హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన గాదె సుమంత్ రెడ్డి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గా పని చేసేవాడు. క్రైస్తవ మతం కావడంతో చర్చికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయనకు వరంగల్ షిర్డీ సాయి నగర్కు చెందిన ఫ్లోరా మరియా పరిచయం అయ్యింది...