భారతదేశం, ఫిబ్రవరి 24 -- Warangal Doctor Attack : ఇటీవల వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారులో వెళ్తున్న డా. సుమంత్‌ను కొందరు దుండగులు అడ్డగించి ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన సుమంత్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.

డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్ చేసి వరంగల్ లో అటాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మహారాష్ట్రలో పట్టుకున్న పోలీసులు వరంగల్ కి తరలిస్తున్నారు. డాక్టర్ హత్యాయత్నంకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను హత్యచేయాలని భార్య ఫ్లోరా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ ప...