తెలంగాణ,వరంగల్, ఏప్రిల్ 2 -- వరంగల్ నగరంలో కొంతకాలంగా వ్యభిచార దందా సాగుతోంది. నిరుపేద మహిళలను టార్గెట్ చేసి వరంగల్ కు తీసుకు రావడం ఆ తరువాత వ్యభిచారం రొంపిలోకి దింపి బిజినెస్ చేయడం కామనైపోయింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం రాత్రి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులను అరెస్ట్ చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని పోస్టల్ కాలనీలో వ్యభిచార గృహం నడిపిస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేదల మహిళలను తీసుకు వచ్చి వారితో చీకటి దందా సాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కూడ...