భారతదేశం, మార్చి 23 -- ముగ్గురు యువకుల అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖిలా వరంగల్‌ ప్రాంతానికి చెందిన చాపర్తి రాజేష్‌ ఇస్త్రీ షాపు నడిపేవాడు. దాని నుంచి వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో.. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చైన్ స్నాచింగ్‌లకు అలవాటు పడ్డాడు.

తన ప్లాన్‌లో భాగంగానే ఈ నెల 11వ తేదీన హనుమకొండ రెడ్డి కాలనీలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హనుమకొండ, వరంగల్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని వినియోగించి నిందితుడిని గుర్తించారు.

శనివారం ఉదయం నిందితుడు పెద్దమ్...