తెలంగాణ,వరంగల్, జనవరి 26 -- కరెన్సీ నోట్లకు రెండింతలు అసలు నోట్లు, నాలుగింతలు నకిలీ నోట్లు ఇస్తామంటూ దందాకు పాల్పడుతున్న వ్యక్తులతో పాటు నకిలీ నోట్లు కొనుగోలు చేస్తున్న ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 8 మంది సభ్యులను అరెస్టు చేసి రూ.38.84 లక్షల అసలు, రూ.21లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్ల కాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి గ్రామానికి చెందిన మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈ వ్యాపారం ద్వారా నిందితుడికి వచ్చే అదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్‌ వేశాడు. తన ప్లాన్‌లో భ...