తెలంగాణ,వరంగల్, మార్చి 23 -- ఆరుగాలం కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నను కొందరు దుండగులు నిండా ముంచుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి నకిలీ పురుగు మందులు, ఎరువులు అంటగట్టి అన్నదాతలను నష్టాల ఊబిలోకి నెడుతున్నారు. ఇలా ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను వరంగల్ టాస్క్ ఫోర్స్, మట్వాడ పోలీసులు పట్టుకున్నారు.

తొమ్మిది మంది సభ్యుల ముఠాలో ఒకరు పరారీలో, మరొకరు జైలులో ఉండగా.. మిగతా ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారి నుంచి సుమారు 78 లక్షల 63 వేల రూపాయల విలువ గల గడువు తీరిన, నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల తయారీ మిషనరీ, ప్రింటింగ్‌ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం కమిషన...