తెలంగాణ,వరంగల్, ఏప్రిల్ 6 -- వరంగల్ నగరంలో వ్యభిచార దందా ఆగడం లేదు. ఓ వైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా, వ్యభిచార గృహ నిర్వాహకులు అదంతా ఏమీ పట్టించుకోకుండా మళ్లీ అదే బాగోతం నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, బాలికలను ట్రాప్ చేసి గలీజ్ దందా సాగిస్తున్నారు.

ఇటీవల వరంగల్ నగర శివారులోని దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ఓ మహిళ తల్లిదండ్రులు లేని మైనర్ బాలికను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపగా.. నగరంలో చాలామంది ఇదే బిజినెస్ నడిస్తున్నారు. ఇలా దందా సాగిస్తున్న ఇద్దరు దంపతులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. వారి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, రూ.1500 నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ...