భారతదేశం, ఏప్రిల్ 1 -- Warangal Crime: వరంగల్ శివనగర్ సమీపంలోని చింతల్ రోడ్డు విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరగగా.. కత్తి పోట్లతో తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడిని స్థానికులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ శివ నగర్ పాడి మల్లారెడ్డి నగర్ కు చెందిన ఓ యువతి, ఓ యువకుడు కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. ఈ విషయం కాస్త అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది.

ఆ యువతి ప్రేమ వ్యవహారంలో వరంగల్‌లోని మైసయ్య నగర్ కు చెందిన కందుల వినయ్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు వినయ్ పై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో యువతి సోదరుడు ఇదివరకు వినయ్ తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సమయంలో కూడా మరో సారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

అప్పటికే పగ పెంచుకున్న యువతి సోదరుడు, అతని స్నేహిత...