భారతదేశం, మార్చి 28 -- Warangal Crime: ఇప్పటికే వరుస చోరీలతో గ్రేటర్ వరంగల్ సిటీలో జనాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా, ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి తలుపులు తడుతుండటం కలవరానికి గురి చేస్తోంది. వరంగల్ ట్రై సిటీ పరిధిలో మూడు వేర్వేరు చోట్లా చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది.

చెడ్డీ గ్యాంగ్ లోని దుండగులంతా ముఖానికి ముసుగు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా నిఘా తక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుని అర్ధరాత్రి తలుపులు బాదుతున్నారు. గతంలో హైదరాబాద్ లో మారణాయుధాలతో దాడులకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తులు, ఇప్పుడు వరంగల్ వీధుల్లో అర్ధరాత్రి చేతుల్లో రాడ్లు, కత్తులతో తిరుగుతున్నారు.

ఈ పరిణామాలపై జనాల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదుర...