భారతదేశం, ఏప్రిల్ 4 -- Warangal Crime: మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడికి జీవిత ఖైదు విధిస్తూ వరంగల్ కోర్టు తీర్పునిచ్చింది. 2024 అక్టోబర్ నెలలో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి రాగా.. అతి తక్కువ కాలంలోనే తీర్పు వెలువడి, దోషికి శిక్ష ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన చాపర్తి సాంబయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు.. తన భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో తన ఇంటి సమీపంలో తనకు మనమరాలి వయసు ఉండే 11 ఏళ్ల ఓ మైనర్ బాలికపై సాంబయ్య కన్నేశాడు.

బాలికను లొంగ దీసుకుని గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ క్రమంలో సెప్టెంబర్ చివరి వారంలో కడుపు నొప్పి వ...