భారతదేశం, ఏప్రిల్ 16 -- Warangal Crime: ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన యువకులు కటకటాల పాలయ్యారు.జైల్లో ఏర్పడిన పరిచయాలతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. పదిమంది సభ్యుల ముఠాను గుర్తించి ఏడుగురిని అరెస్ట్ చేశారు.

వరంగల్ నగరం హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన కోటగిరి సాయి వినయ్ ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2023లో తన స్నేహితుడు వరుణ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి నుంచి గంజాయి తీసుకొస్తుండగా, అప్పుడు డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని రాజమండ్రి జైలుకు పంపించారు.

అక్కడ సాయి వినయ్‌కు ములుగు జిల్లా జగ్గన్నపేట మండలం అన్నంపల్లికి చెందిన లావుడ్యా రవీందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను గంజాయి అమ్ముతుంటానని చెప్పి, అతడి ఫోన్ నెంబర్ సాయి వినయ్ కి ఇచ్చాడు. ఇదిలాఉంటే లావుడ్యా రవీందర్ ...