భారతదేశం, ఏప్రిల్ 1 -- Warangal Crime: సిగరెట్‌ పొగతో రేగిన గొడవలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో ఉగాది పండగ సందర్భంగా జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గవిచర్ల గ్రామంలో ఏటా ఉగాది సందర్భంగా గుండ బ్రహ్మయ్య జాతర ఘనంగా జరుగుతుంది.

ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కాగా ఆదివారం జరిగిన జాతరకు సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్ర బన్నీ(21), తల్లి పూల, సోదరి పూజిత, అన్న శివ, స్నేహితుడు గిరి బాబుతో కలిస్ వచ్చాడు. దర్శనం అనంతరం శివ, తల్లి పూల, చెల్లి పూజిత ఇంటికి వెళ్లిపోయారు. బన్నీ, అతని స్నేహితుడు జాతరలోనే ఉండిపోయారు.

జాతరలో దేవాలయానికి కొద్ది దూరంలో బన్నీ సిగరెట్ తాగుత...