భారతదేశం, ఫిబ్రవరి 21 -- Warangal Crime: భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కోర్టులో ప్రైవేటు కేసు వేసిన రాజ లింగమూర్తిని కొందరు దుండగులు కిరాతకంగా హతమార్చిన గంటల వ్యవధిలోనే వరంగల్ నగరంలో మరో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఓరుగల్లు వాసులు భయాందోళనకు గురవుతుండగా, పెరుగుతున్న క్రైమ్ ను కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, అప్పటి అధికారులపై కోర్టులో కేసు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి(50) అనే వ్యక్తి బుధవారం రాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లి పట్టణంలో నడిరోడ్డుపై ఆయనను కొందరు దుండగులు అతి కిరాతకంగా చంపేశారు.

కడుపులో, తలపై కత్తులతో విపరీతంగా పొడవడటంతో రాజ లింగంమూర్తి ఘటన స్థలంలో...