భారతదేశం, మార్చి 24 -- Warangal Crime: యువతికిఉద్యోగం చూపించినందుకు వరంగల్‌లో యువకుడిపై దాడి చేశారు.ఈ ఘటనలో పోలీసులు 29 మంది యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో శనివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ములుగు జిల్లా నర్సాపూర్ కు చెందిన కొండం సాయిచరణ్ అనే యువకుడు ప్రస్తుతం వరంగల్ నగరంలోని న్యూ శాయంపేటలో ఉంటున్నాడు. ఉపాధి కోసం డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. వరంగల్ నగరంలోని ఓ వెహికిల్ షోరూంలో పని చేస్తున్న తన అక్కతో పాటు వరంగల్ జాన్ పీరీలు ఏరియాకు చెందిన ఓ ముస్లిం యువతి పని చేస్తుండగా, ముస్లిం యువతి అక్కడ ఇచ్చే జీతం సరిపోక వేరే ఉద్యోగం ఏదైనా ఉంటే చూడాల్సిందిగా సాయి చరణ్ ను వేడుకుంది.

దీంతో హనుమకొండ చౌరస్తాలోని ఓ కన్సల్టెన్సీలో ఉద్యోగం ఉంద...