భారతదేశం, మార్చి 10 -- Warangal CP : వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన అంబర్ కిశోర్ ఝా రామగుండం కమిషనరేట్ కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో సీపీగా సన్ ప్రీత్ సింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం ఉదయం వరంగల్ కమిషనరేట్ కు చేరుకున్న ఆయనకు ఇక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనరేట్ ఆఫీస్ లో సీపీగా సన్ ప్రీత్ సింగ్ ఛార్జ్ తీసుకున్నారు. కాగా వరంగల్ కమిషనరేట్ లో కొద్దిరోజులుగా దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లతో క్రైమ్ కంట్రోల్ తప్పుతుండగా.. నిఘా లోపం, కొంతమంది పోలీస్ సిబ్బంది వ్యవహార శైలితో డిపార్ట్మెంట్ పేరు దెబ్బతింటోంది. ఇలా వివిధ రకాల సవాళ్లు సీపీ ముందు ఉండగా.. వీటన్నింటినీ చక్కదిద్దడంలో ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారోననే చర్చనడుస్తోంది.

వరంగల్ నగరంలో కొద్దిరోజులుగా మర్డర్లు కామనైపోయాయి. 2024 డిసెంబర్ 3న రాజా మోహన్ అనే రిటైర్డ్ బ్యాంక్ మ...