తెలంగాణ,వరంగల్, ఏప్రిల్ 4 -- వరంగల్ జిల్లా కోర్టు సముదాయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో బాంబు ఉందంటూ హనుమకొండ, వరంగల్ జిల్లా జడ్జీలకు మెయిల్ పంపించగా.. వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ, వరంగల్ జిల్లా కోర్టు జడ్జీలకు ఒక మెయిల్ వచ్చింది. కోర్టు నిర్వహణ సమయంలో దానిని చూసుకున్న జిల్లా జడ్జీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కోర్టులో బాంబు ఉందనేది ఆ మెయిల్ సారాంశం కాగా.. జిల్లా జడ్జీలు వెంటనే విషయాన్ని వరంగల్ కమిషనరేట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

కమిషనరేట్ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీమ్ సిబ్బంది వెంటనే వరంగల్ జిల్లా కో...