భారతదేశం, ఏప్రిల్ 8 -- Warangal Bus Accident : వరంగల్ నగర శివారులో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానికులు, పోలీసులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదం తెల్లవారుజామున జరగడం, ఆ సమయంలో పెద్ద వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ డిపోనకు చెందిన టీఎస్ 09 జడ్ 8057 నెంబర్ గల ఆర్టీసీ ఏసీ బస్సు ఒంగోలు నుంచి వరంగల్, హనుమకొండ మీదుగా తిరుగు ప్రయాణమైంది.

ఈ మేరకు హనుమకొండ బస్టాండ్ లో కొంతమంది ప్రయాణికులు దింపి, 21 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ కు వెళ్తోంది. ఈ క్రమంలో వరంగల్ నగరంలో చింతగట్టు క్యాంప్ ఏరియా సమీపంలోని రింగ్ రోడ్డు వద్దకు తెల్లవారుజామున 3.30 గంటల సుమారులో చేరుకుంద...