భారతదేశం, ఏప్రిల్ 13 -- వరంగల్‌.. ఈ పేరు వింటే మొదట గుర్తొచ్చేది భద్రకాళి అమ్మవారి ఆలయం. ప్రస్తుతం ఈ దేవాలయం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.54 కోట్లతో ఇటీవల పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్‌ సూచనలతో తమిళనాడులోని మదురైలోని మీనాక్షి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పనులను పర్యవేక్షిస్తున్నారు.

1.భద్రకాళీ ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రత్యేక రోజుల్లో భద్రకాళి అమ్మవారి ఊరేగింపులు, వాహన సేవలకు ఉపయోగపడేలా 30 అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్‌లను ఖరారు చేశారు.

2.ప్రస్తుతం దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి ఖాళీ స్థలాలను చదును చేసే పనులు సాగుతున్నాయి. ఆలయం నాలుగువైపులా రాజగోపురాలను నిర్మ...