భారతదేశం, ఏప్రిల్ 7 -- Warangal Betting: ఐపీఎల్ సీజన్ వేళ పోలీసులు బెట్టింగ్ దందాపై నిఘా పెంచారు. వరంగల్ పోలీసులు ఏపీకి చెందిన ఒక క్రికెట్ బెట్టింగ్ బుకీని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.లక్షన్నర నగదు, రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో ప్రధాన బుకీ పరారీలో ఉండగా, తొందర్లోనే అతడిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు బుకీ అరెస్టుకు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆదివారం హనుమకొండ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణి కుమార్ అలియాస్ పండు అనే యువకుడు 2023లో గోవాకు వెళ్లాడు. అక్కడ హైదరాబాద్ కు చెందిన యోగేశ్ గుప్తా అలియాస్ జోగేశ్ గుప్తా అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాటలు కలవగా.. యోగేశ్ గుప్తా ఆన్ లైన్ వేద...