భారతదేశం, మార్చి 26 -- warangal Betting: ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో వరంగల్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ దందా కూడా మొదలైంది. ఆన్ లైన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులంతా అదే ప్లాట్ ఫామ్ లో బెట్టింగ్ నిర్వహిస్తూ దందా చేయడం స్టార్ట్ అయ్యింది.

ఇలా ఆన్ లైన్ యాప్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా సభ్యులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో మంగళవారం రాత్రి ముగ్గురిని పట్టుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి నుంచి పోలీసులు లక్షా 58 వేల రూపాయల నగదు, నాలుగు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ బోరబండా ఏరియాకు చెందిన చింతపండు కృష్ణ చిట్ ఫండ్స్ బిజినెస్ నడిపించేవాడు. ఆయనతో పాటు హన...