తెలంగాణ,వరంగల్, ఏప్రిల్ 3 -- వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు భూముల వ్యవహారం కొలిక్కిరాలేదు. భూసేకరణ నిమిత్తం గురువారం ఉదయం వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్, ఇతర అధికారులు వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రైతులతో సమావేశం కాగా.. ఆఫీసర్లు, రైతుల మధ్య సయోధ్య కుదరలేదు. పరిహారం విషయంలో రైతులు తగ్గకపోవడంతో చర్చలు కాస్త విఫలమయ్యాయి. దీంతో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూసేకరణ విషయంలో ఆఫీసర్లు తలలు పట్టుకోవాలసిన పరిస్థితి నెలకొంది.

మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు 253 ఎకరాలు అవసరం కాగా.. ఆ భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 17న రూ.205 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. ఈ మేరకు మామునూరు ఎయిర్ పోర్టు సమీపంలోని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల శివారులో భూమిని సేకరించేందుకు ఆఫీసర...