భారతదేశం, మార్చి 4 -- మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన పనుల్లో భాగంగా.. మంగళవారం రెవెన్యూ అధికారులు భూముల సర్వేకు వెళ్లారు. వారిని అడ్డుకుని రైతులు నిరసన చేపట్టారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ రోడ్డెక్కి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మామునూరు సీఐ ఒంటేరు, ఇతర పోలీస్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ తమకు న్యాయం జరిగేదాక భూముల సర్వే ముందుకు కదలనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. దీంతో మామునూరు ఎయిర్ పోర్టు సమీపంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎమ్మార్వో నాగేశ్వరరావు ఇతర అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని భూములు కోల్పోతున్న రైతులు స్పష్టం చేశారు. ఇక్కడ భూములు ...