తెలంగాణ,వరంగల్, మార్చి 2 -- వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా... ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ మామునూరు విమానాశ్రయం కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలన్నారు. నిత్యం రాకపోలు ఉండేలా డిజైన్ రూపకల్పన చేయాలని సూచించారు.

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

డిజైనింగ్ కు పంపించే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ...