భారతదేశం, మార్చి 2 -- మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. ఎయిర్‌పోర్టుకు 2800 మీటర్ల రన్‌వే అవసరం అని చెప్పారు. 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని.. గత ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందువల్ల ఆలస్యమైందని వ్యాఖ్యానించారు.

'మామునూరు విమానాశ్రయం కోసం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకుని క్లియరెన్స్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే.. ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అవుతాయి. ఎయిర్ పోర్టును ఎవరు తీసుకొచ్చినా.. ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం' అని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

'భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టు విషయంలో గతంలో ఒక స్థ...