భారతదేశం, ఫిబ్రవరి 22 -- Warangal Accident : పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. చెల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. వరంగల్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో అన్నతో పాటు మరో వ్యక్తి దుర్మరణం చెందాడు. దీంతో చెల్లి పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో అన్న చావు డప్పు మోగింది. ఉపాధి కోసం పక్క జిల్లాకు వచ్చిన యువకుడి మరణంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఎర్ర అఖిల్(28) హనుమకొండ హంటర్ రోడ్డు శాయంపేటలోని పిరమిల్ హౌజింగ్ లోన్ బ్యాంక్ లో పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 23న ఆదివారం తన చెల్లి పెళ్లి ఉండటంతో ఏర్పాట్లు చేసే పనిలో పడ్డాడు.

ఈ మేరకు శుక్రవారం రాత్రి సమయంలో తనతో కలిసి పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మ...