భారతదేశం, మార్చి 1 -- వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ.. డాక్టర్ సుమంత్ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి.. శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించాలని సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా ప్లానే వేసింది. వరంగల్‌లో కారుని అడ్డగించి నడిరోడ్డు మీద సుమంత్ రెడ్డిపై ఐరన్ రాడ్లతో నిందితులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి 8 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారు.

వరంగల్ హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన గాదె సుమంత్ రెడ్డి.. జనరల్ ఫిజీషియన్ డాక్టర్‌గా పని చేసేవారు. క్రైస్తవ మతం కావడంతో చర్చికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయనకు ఫ్లోరా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2016లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమంత్ రెడ్డి బంధువులకు సంగారెడ్డిలో ...