భారతదేశం, మార్చి 8 -- పన్నులు కట్టనివారిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్నిచోట్ల ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రెండేళ్ల నుంచి పన్ను కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న.. హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే ఆదేశాల మేరకు.. కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ శనివారం బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. రెండేళ్ల నుంచి దాదాపు 2 లక్షల 56 వేల వరకు పన్ను బకాయి పడగా.. వెంటనే ట్యాక్స్ చెల్లించాల్సిందిగా అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.

అయినా డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం నుంచి స్పందన లేదు. దీంతో ఇటీవల రెడ్ నోటీస్ కూడా అందజేశారు. నిర్ద...